కేఏ పాల్‌తో జేడీ లక్ష్మీనారాయణ కలువడంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఫస్ట్ చూసి ఇది AI జనరేట్ చేసిన ఫోటో అనుకున్నానని, వీడియో చూశాక నిజమని అర్థమయ్యిందని తెలిపారు.
ఈ పనులకు రూ.3.42 కోట్లు వెచ్చించినట్లు మేయర్ ప్రకటించారు. రూ.కోటి కూడా ఖర్చు కాని ఈ పనులకు రెట్టింపు స్థాయిలో కేటాయింపులు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్టీల్ ప్లాంట్ కోసం తాను కోర్టుకు వెళ్లిన విషయం తెలిసి తనకు మొదటిసారి అక్కడ పాలాభిషేకం చేశారన్నారు కేఏ పాల్. తన జీవితంలో పాలాభిషేకం ఇదే తొలిసారి అన్నారు.
విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించి కేశినేని చిన్ని తేనేతుట్టేను కదిలించారు. ఇక్కడినుంచి చిన్ని సోదరుడు నాని ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్‌లో బెట్టింగ్ కలకలం రేపింది. ఆర్సీబీ పేసర్ సిరాజ్‌తో ఏపీకి చెందిన ఒకరు వాట్సాప్ చేశారు. సిరాజ్ బీసీసీఐ యాంటి కరప్షన్ విభాగానికి సమాచారం ఇవ్వడంతో అతనిని అరెస్ట్ చేశారు.
నిండు గర్భిణి ప్రాణం తీసుకోవడం అందరినీ కలచివేస్తోంది. కొన్ని రోజులు ఆగితే ఓ బిడ్డకు ప్రాణం పోసేవారని వాపోయారు. పుట్టబోయే బిడ్డ భారమవుతుందని భావించి వారిద్దరూ తనువు చాలించారని తెలుస్తున్నది
సంతబొమ్మాళీ మండలంలో మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.4,362 కోట్ల వ్యయంతో పోర్టు పనులకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో నాలుగు బెర్తులను నిర్మించనున్నారు.