CM JAGAN:సెప్టెంబర్ నుంచి విశాఖపట్టణం (Vizag) నుంచి పరిపాలన కొనసాగిస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి (cm jagan) ప్రకటించారు. తాను కూడా విశాఖలోనే (vizag) ఉంటానని తెలిపారు. ఈ రోజు శ్రీకాకుళం (srikakulam) జిల్లా పర్యటనలో భాగంగా అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ప్రతీ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తానని జగన్ తెలిపారు.
మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి సీఎం జగన్ (cm jagan) శంకుస్థాపన చేశారు. నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీ, ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ సహా హిర మండలం వంశధార లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వీటితో శ్రీకాకుళం ముఖచిత్రం మారిపోతాయని సీఎం జగన్ (cm jagan) అన్నారు. గత పాలకులు సిక్కొలును పట్టించుకోలేదని చెప్పారు. ఇకపై మూలపేట అభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తోందని చెప్పారు. మూలపేట మరో ముంబై, విష్ణుచక్రం మరో మద్రాస్ కాబోతున్నాయని తెలిపారు. పోర్టు నిర్మాణం కోసం 4362 కోట్లు ఖర్చు చేశామని.. 24 నెలల్లో పూర్తవవుతుందని తెలిపారు. పోర్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 వేల మందికి ఉపాధి కలుగుతుందని తెలిపారు.
పోర్టు వస్తే, పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయని సీఎం జగన్ (cm jagan) తెలిపారు. అప్పుడు మన పిల్లలకు జిల్లాలోనే ఉద్యోగాలు వస్తాయన్నారు. గంగపుత్రుల కళ్లలో కాంతులు నింపడానికే ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తున్నామని వివరించారు. గంగపుత్రులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేందుకు పోర్టుతోపాటు ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 4 పోర్టులు ఉండగా.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 4 పోర్టులకు శ్రీకారం చుట్టిందని వివరించారు. తీర ప్రాంత అభివృద్ది కోసం గతంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు అని సీఎం జగన్ (cm jagan) అడిగారు.