సెలబ్రిటీ క్రికెట్ లీగ్(CCL)2023 చాంపియన్ షిప్ ను తెలుగు వారియర్స్(Telugu Warriors) నాలుగో సారి గెల్చుకుని రికార్డు సృష్టించింది. నిన్న విశాఖలో జరిగిన ఫైనల్ మ్యాచులో భోజ్‌పురి దబాంగ్స్(Bojpuri Dabanggs)పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. లలిత్ మోదీ(Lalit Modi), నరేంద్ర మోదీ, నీరవ్ మోదీ ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసి ‘జనరల్ నాలెడ్జ్ ప్రశ్న.. దీనిలో కామన్ గా ఉంది ఏంటీ’ అంటూ కామెంట్ చేశారు. అయితే ప్రకాశ్ రాజ్ ట్వీట్ కు ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు‘మొదటి వ్యక్తి (లలిత్ మోదీ) కాంగ్రెస్ హయాంలోనే స్కామ్ లకు పాల్పడ్డారు.
మంచు లక్ష్మీ(Manchu Lakshmi) కూతురు విద్యా నిర్వాణ(Vidya Nirvana)కు ప్రమాదం(Accident) జరిగింది. ఈ ప్రమాదం జరిగి చాలా రోజులు అయ్యిందని, ఆ ప్రమాదంలో మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ ముఖానికి గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయం గురించి మంచు లక్ష్మీ(Manchu Lakshmi) క్లారిటీ ఇచ్చింది. మార్చి 19వ తేదిన మోహన్ బాబు(Mohan Babu) పుట్టిన రోజు సందర్భంగా పిల్లలంతా కూడా బగ్గీలో ప్రయాణిస్తుండగా...
CM Jagan : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం సీఎం జగన్ పై బాగా ఎక్కువగా పడిందనే చెప్పాలి. ఈ ప్రభావం ఆయన ఈ రోజు దెందులూరు సభలో స్పష్టంగా కనపడుతోంది. ఇంతకీ మ్యాటరేంటంటే.... సీఎం జగన్ ఈ రోజు దెందులూరు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
Nara Rohith : ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారా అని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి టీడీపీని ఆయన పరిధిలోకి తీసుకోవాలని ఆశించేవారు చాలా మంది ఉన్నారు. అయితే ఆయన మాత్రం ప్రస్తుతం సినిమాల పై మాత్రమే ఫోకస్ పెట్టారు. కాగా.. ఆయన రాజకీయాల్లోకి వచ్చే విషయమై నటుడు నారా రోహిత్ స్పందించారు.
ఏపీ పోలీసుల(AP Police)కు సర్కార్ ఆర్థిక భరోసా కల్పించడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బకాయిల చెల్లింపులతో పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో పాలనను గాడిలో పెట్టేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పోలీసు అధికారులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలి...
ఎవరికీ అనుమానం రాకుండా కాంట్రాక్టు ఉద్యోగి గంగాధరం గంజాయి ప్యాకెట్లను కాళ్లకు చుట్టుకుని రవాణా చేస్తుండటం చూసి అధికారులు షాక్ అయ్యారు. తిరుమల(Tirumala) కొండపై గంజాయి రవాణా జరుగుతుండటంపై టీడీపీ(TDP) అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ట్విట్టర్ వేదికగా స్పందించారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి పరిస్థితి రావడం అత్యంత బాధాకరమని అన్నారు. భక్తుల మనోభావాల విషయంలో సర్కార్ బాధ్యతగా వ...
ఏపీలో వైఎస్ఆర్ ఆసరా పథకం మూడో విడత నిధులను ఏలూరు జిల్లా దెందులూరులో సీఎం జగన్(ap cm jagan) బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ క్రమంలో మహిళలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నట్లు గుర్తు చేశారు. మరోవైపు చంద్రబాబు (chandrababu naidu)మాత్రం మహిళలకు డ్వాక్రా రుణాలు(dwcra loans) కట్టవద్దని తప్పుదొవ పట్టించారని జగన్ అన్నారు.
ఏపీ టీడీపీ నేత చింతకాయల విజయ్(Chintakayala Vijay)కి సీఐడీ(CID) మరోసారి నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో పోస్టుల అంశంపై మార్చి 28న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.
మంచు మనోజ్(manchu manoj) వీడియోపై మంచు విష్ణు(manchu Vishnu) స్పందించారు. మా ఇద్దరి మధ్య సాధారణ గొడవనే అని విష్ణు పేర్కొన్నారు. మనోజ్ చిన్నవాడని దీనిపై స్పందించాల్సిన పెద్ద విషయం కాదని అన్నారు. మనోజ్ షేర్ చేసిన వీడియోలో వీరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. వీడియోలో విష్ణు మనోజ్ అనుచరులపై దాడికి పాల్పడినట్లు కనిపిస్తోంది.
ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి శుక్రవారం ప్రతిపక్ష TDPలో చేరారు. ఏపీ మాజీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) సమక్షంలో గిరిధర్, అతని అనుచరులు పార్టీ కండువా కప్పుకున్నారు.
ఏపీలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై నలుగురు వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YSRCP) ఎమ్మెల్యేలను(mlas) శుక్రవారం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) నలుగురు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డిలను సస్పెండ్ చేస...
Vallabhaneni Vamshi : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా దుమారం రేపాయి. కచ్చితంగా వైసీపీనే గెలుస్తుందనుకున్న చోట.. క్రాస్ ఓటింగ్ జరిగి టీడీపీ గెలవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ గెలుపును టీడీపీ నేతలు ఎంజాయ్ చేస్తుంటే... అధికార వైసీపీ నేతలు రగిలిపోతున్నారు.
Manchu Family : ఒకే ఒక్క చిన్న వీడియో మంచు ఫ్యామిలీ ఇంటి గుట్టుని రోడ్డున పడేసింది. వాస్తవానికి మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి.. మంచు బ్రదర్స్ మధ్య వార్ నడుస్తోందనే ప్రచారం ఊపందుకుంది.
Jogi Ramesh : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆ0ధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపాయనే చెప్పాలి. అధికార పార్టీ కి ఎంత బలం ఉన్నా... బలం లేని ప్రతిపక్ష పార్టీ విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. టీడీపీ నేత పంచుమర్తి అనురాధ విజయం ఇప్పుడు అధికార పార్టీకి మింగుడుపడటం లేదనే చెప్పాలి.