»Cm Jagan Laid The Foundation Stone For The Construction Of Mulapet Green Field Port
Mulapeta Port:మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్
సంతబొమ్మాళీ మండలంలో మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.4,362 కోట్ల వ్యయంతో పోర్టు పనులకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో నాలుగు బెర్తులను నిర్మించనున్నారు.
Mulapeta Port: ఏపీ సీఎం జగన్(CM Jagan) శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మూలపేట(Mulapeta) బీచ్ లో గంగమ్మతల్లికి సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత సంతబొమ్మాళీ మండలంలో మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.4,362 కోట్ల వ్యయంతో పోర్టు పనులకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో నాలుగు బెర్తులను నిర్మించనున్నారు. జనరల్ కార్గో(Corgo), బొగ్గుకు కంటైనర్ తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోంచే విధంగా 30 నెలల్లో ఈ పనులను పూర్తి చేయనున్నారు. అనంతరం నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి జగన్ శంకుస్థాపన చేశారు. 594 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం అందించారు. కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు.
అంతకుముందు సీఎం జగన్ గన్నవరం నుంచి ప్రత్యేక విమానం(Flight)లో విశాఖపట్నానికి(Vizag) చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ లో మూలపాడుకు చేరుకున్నారు. మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా(Odisha) రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు కీలకంగా మారనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. అలాగే ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్ నుంచి హిర మండలం రిజర్వాయర్‌కు రూ.176.35 కోట్లతో వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు, రూ.852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పనులకు కూడా బుధవారం సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.