• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి

కృష్ణా: మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి కొల్లు రవీంద్ర నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బయో మెడికల్ వ్యర్థాల ట్రాకింగ్ వ్యవస్థను పరిశీలించారు. అనంతరం డాక్టర్లు ఆస్పత్రి సిబ్బందితో సమావేశమై ఆస్పత్రిలో ఉన్న ఎక్విప్‌మెంట్ పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని, అవసరమైన పరికరాలను తక్షణమే ఏర్పాటు చేస్తామని భరోసా తెలిపారు.

February 22, 2026 / 07:33 AM IST

మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు: సీఐ

SKLM: పలాస కాశీబుగ్గ పట్టణంలో సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న నలుగురి వ్యక్తులు పట్టుబడినట్లు సీఐ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

February 22, 2026 / 07:32 AM IST

ఓటర్ల మాపింగ్ వేగవంతం చేయాలి

TPT: అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల మాపింగ్ శాతాన్ని పెంచాలని నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి ఎన్.మార్య సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం ఆమె సమావేశం నిర్వహించారు. 2025 జాబితాను 2002 జాబితాతో సరిపోల్చే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

February 22, 2026 / 07:32 AM IST

చిన్నారిపై అత్యాచారయత్నం.. కేసు నమోదు

ATP: పామిడి మండలంలోని ఓ తండాకు చెందిన సెటానాయక్ అనే వ్యక్తిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మూడవ తరగతి చదువుతున్న చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

February 22, 2026 / 07:30 AM IST

VIDEO: కారు ఢీకొని వృద్ధుడు మృతి

ELR: బుట్టాయిగూడెం మండలం నందాపురంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి దాటుతున్న పాయల సుబ్బారావు (60) అనే వ్యక్తిని వేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. మద్యం మత్తులో ఉన్న కారు వేగంతో వాహనాన్ని నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో సుబ్బారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

February 22, 2026 / 07:28 AM IST

ప్రధాన హోటల్ బుకింగ్స్ పేరుతో మోసం

VZM: ప్రఖ్యాత హోటళ్ల పేర్లతో నకిలీ వెబ్‌సైట్‌లు సృష్టించి ఈ బుకింగ్స్ పేరుతో మోసం చేస్తున్న ముఠా ప్రధాన నిందితుడిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన యతేంద్ర జటావ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా మోసం వెలుగులోకి వచ్చింది. అతని వద్ద నుంచి కంప్యూటర్లు, సాంకేతిక పరికరాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

February 22, 2026 / 07:26 AM IST

APTF రాష్ట్ర అకడమిక్ కౌన్సిలర్ గా రెండోసారి నియామకం

VZM: ఆంద్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF ) రాష్ట్ర అకడమిక్‌ కౌన్సిలర్‌గా బొబ్బిలికి చెందిన జె.సి.రాజు రెండవసారి ఎన్నికయ్యారు.ఈ మేరకు శనివారం ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల తెలియజేశారు. ఈ సందర్భంగా జేసీ రాజు మాట్లాడుతూ.. సంఘ నిర్మాణానికి, అభివృద్ధికి, ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

February 22, 2026 / 07:23 AM IST

రాయచోటిలో పెరిగిన చికెన్ ధరలు

అన్నమయ్య: రంజాన్ మాసం సందర్భంగా రాయచోటిలో మాంసం ధరలు పెరిగాయి. చికెన్ కిలో ధర రూ. 210 నుంచి రూ. 240కి చేరగా, మటన్ ధర కిలోకు రూ. 800గా కొనసాగుతోంది. చేపల ధరలు రూ. 100 నుంచి 300 మధ్య ఉన్నాయి. ఆదివారం కావడంతో చికెన్ దుకాణాల వద్ద కొనుగోలుదారుల రద్దీ భారీగా కనిపించింది. ధరలు పెరిగినా వినియోగదారుల రద్దీ తగ్గలేదు. వ్యాపారులు డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు.

February 22, 2026 / 07:23 AM IST

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్: ఎస్పీ

ప్రకాశం: జిల్లాలో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పరీక్షల సమయంలో పరీక్ష కేంద్రాల వద్ద గుంపులుగా ఉండటం, కేంద్రాలలోకి వెళ్లడం నిషేధమని, అలాగే పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలోని జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.

February 22, 2026 / 07:22 AM IST

జిల్లా ఆర్టీఐ కోఆర్డినేట్ కమిటీ సభ్యుడిగా మణికుమార్

రాజానగరం మండలం కొండగుంటూరు గ్రామానికి చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్ పెంపెట్ల మణికుమార్ను తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేట్ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు శనివారం జిల్లా రెవెన్యూ అధికారి టీ. సీతారామ మూర్తి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పెంపెట్ల మణికుమార్ ఎంపిక కావడం పట్ల పలు ప్రజా సంఘాల నేతలు, పలువురు సామాజికవేత్తలు అభినందిస్తున్నారు.

February 22, 2026 / 07:20 AM IST

విషాదం.. నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి

KRNL: గూడూరు పట్టణం పడమర బీసీ కాలనీలో శనివారం ఐదేళ్ల బోయ విజయలక్ష్మి ఆటలాడుతూ మున్సిపాలిటీ నీటి తొట్టిలో పడి మృతి చెందింది. తల్లిదండ్రులు ఉపాధి కోసం గుంటూరులో ఉండగా, తాత–అవ్వల వద్ద ఉన్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటిలో పడినట్లు కాలనీవాసులు చెప్తుతున్నారు. ఈ ఘటనతో కాలనీలో విషాదం నెలకొంది.

February 22, 2026 / 07:20 AM IST

‘YVU అభివృద్ధికి తక్షణమే నిధులు కేటాయించాలి’

కడప YVU అభివృద్ధికి నిధులు కేటాయించాలని RSF రాష్ట్ర అధ్యక్షులు D. ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు. నిర్మాణ దశలో ఆగిపోయిన పరిపాలన భవనం, హాస్పిటల్ వంటి నిర్మాణాలను పూర్తి చేయాలని ఆయన కోరారు. అలాగే, వర్సిటీలో ఇంజనీరింగ్, ఫార్మసీ, లా, బి.ఎడ్ కళాశాలలను ఏర్పాటు చేయడంతో పాటు, అడ్మిషన్లు పెంచేందుకు ఉమ్మడి పీజీ సెట్‌ను రద్దు చేయాలని ఆయన స్పష్టం చేశారు.

February 22, 2026 / 07:18 AM IST

‘నాణ్యమైన వస్తువులను కొనాలి’

ASR: వారపు సంతల్లో నాణ్యమైన వస్తువులను కొనుగోలుచేయాలని ముంచంగిపుట్టు SI నాని ప్రజలకు సూచించారు. శనివారం ఆయన ముంచంగిపుట్టు వారపు సంతను సందర్శించారు. వారపు సంతల్లో కల్తీలేని, నాణ్యమైన సరుకులు విక్రయించాలని వ్యాపారులు, దుకాణాదారులకు సూచించారు. తూకాలు, కొలతలు సక్రమంగా ఉండాలన్నారు. సంతకు వచ్చిన ప్రజలతో సమావేశమయ్యారు. సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు.

February 22, 2026 / 07:15 AM IST

శ్రీసిటీని సందర్శించిన మాజీ డీజీపీ

TPT: మాజీ డీజీపీ డా. ఎం.మాలకొండయ్య శనివారం శ్రీసిటీని సందర్శించారు. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు స్వాగతం పలికి, శ్రీసిటీ పారిశ్రామిక ప్రగతి, ఇతర కార్యకలాపాలను వివరించగా.. విజన్, ప్రణాళిక, అమలు తీరును ప్రశంసించిన ఆయన దేశంలో ఆదర్శ పారిశ్రామిక కేంద్రంగా శ్రీసిటీ నిలుస్తుందని కొనియాడారు.

February 22, 2026 / 07:13 AM IST

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

VZM: చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 28వ జాతర మహోత్సవం సందర్భంగా తొలి పూజ కార్యక్రమంలో చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకటరావు కుటుంబ సమేతంగా ఆదివారం పాల్గొన్నారు. ఈసందర్బంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో TDP రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు పాల్గొన్నారు.

February 22, 2026 / 07:12 AM IST