ASR: కొయ్యూరు మండలంలోని రాజేంద్రపాలెం వారపు సంతను ఆదివారం కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు, ఎస్సై పీ.కిషోర్ వర్మ, మంప ఎస్సై శ్రీనివాస్ సందర్శించారు. వారపు సంతకు వచ్చిన మారుమూల గ్రామాల గిరిజనులతో సమావేశం నిర్వహించారు. రహదారి భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. వాహన రికార్డులను సక్రమంగా కలిగి ఉండాలన్నారు.
KRNL: పెద్దకడబూరు మండలంలోని బాపురంలో వెలసిన శ్రీ గంగాదేవి రథోత్సవం ఆదివారం అశేష భక్తవాహిణి నడుమ కన్నుల పండుగగా జరిగింది. ఉదయం అమ్మవారికి బాపురం క్షేత్ర పీఠాధిపతులు శ్రీ బసలింగమ్మ అవ్వ ఆధ్వర్యంలో ఆకుపూజ, కుంకుమార్చన, బిల్వార్చన, పంచామృతాభిషేకంతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం నుంచి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తెచ్చి రథంపై ప్రతిష్టించి రథోత్సవం నిర్వహించారు.
AKP: నర్సీపట్నం మండలం చెట్టుపల్లిలో కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. వైద్య శిబిరంలో 240 మంది రోగులు చికిత్సలు చేయించుకోగా వారిలో 26 మందికి ఆపరేషన్ నిర్వహిస్తామని వైద్యులు పేర్కొన్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులతో పాటు కళ్లద్దాలు అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు.
అన్నమయ్య: తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని ‘బంగారు తంబళ్లపల్లె’గా మార్చడమే లక్ష్యమని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ బి. హరిప్రసాద్ అన్నారు. త్వరలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను తంబళ్లపల్లెకు రప్పిస్తామని తెలిపారు. ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
ELR: ఆదివారం పెదవేగి మండలం విజయరాయి గాంధీ నగర్ లోని సీతారామ కళ్యాణమండపంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం ఆదివారం జరిగింది. వారం రోజుల్లోగా కోకో గింజల ధరల పాలసీ ప్రకటించి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధర నిర్ణయించకపోతే కోకో రైతుల పోరాటం తప్పదని, అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
VSP: ఏఐ సమ్మిట్లో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై కూటమి నేతలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. సమ్మిట్ జరుగుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రవేశించి దాడి చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇందులో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ అధ్యక్షుడు పివిఎన్.మాధవ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు.
PLD: నరసరావుపేటలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 69వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. చిత్రాలయ సెంటర్‌లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఆజాద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రిగా విశేష సేవలందించారని కొనియాడారు.
ప్రకాశం: దోర్నాలలోని టోల్గేట్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒక కంటైనర్ అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తతతో భారీ ప్రమాదం తప్పిందని, స్థానికులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో వాహనం కొంతమేరకు ధ్వంసమైంది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
AKP: నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన మహిళ కట్ట భాను పాయకరావుపేటకు ఆటోలో ఈనెల 20న వస్తు మూడు తులాల బంగారు నెక్లెస్ పోగొట్టుకుంది. దీనిపై పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఆధారంగా రాజయ్య పేటకు చెందిన మహిళకు నక్లెస్ దొరికినట్లు గుర్తించారు. దొరికిన మహిళను విచారించగా నక్లెస్ ఇచ్చింది. దానిని కుటుంబ సభ్యులకు అందజేశారు.
విజయనగరం రింగ్ రోడ్లో నిర్మిస్తున్న YCP జిల్లా కార్యాలయ నిర్మాణ పనులను పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఉప శాసనసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి ఆదివారం పరిశీలించారు. నిర్మాణ పురోగతిని సమీక్షించి, నాణ్యతతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకు సూచించారు.
PLD: ముప్పాళ్ల మండలం చాగంటివారి పాలెం గ్రామ శివారులో రహస్యంగా పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఎస్సై పి. అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ మెరుపు దాడిలో పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 18,070 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సత్యసాయి: పరిగి మండలం శాసనకోటలో మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఆదివారం ‘కాఫీ విత్ క్యాడర్’ నిర్వహించారు. గడపగడపకూ వెళ్లి ప్రజలను పలకరిస్తూ గత జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి అన్యాయం చేస్తోందని విమర్శించారు.
కడప: ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభలు ఆదివారం ఎరుపెక్కాయి. భారీ ర్యాలీ అనంతరం జరిగిన సభలో రాష్ట్ర నేతలు ఎస్.వెంకటసుబ్బయ్య, చలసాని వెంకటరామారావు పాల్గొన్నారు. ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు, లేబర్ కోడ్ల అమలుపై వారు తీవ్రంగా మండిపడ్డారు. కార్మిక హక్కులు, ఆశా-అంగన్వాడీల కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం పాలకులపై కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని కోరారు.
కర్నూలు: జిల్లా కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు ఆదివారం కలెక్టర్ సిరి తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో అర్జీలు స్వీకరిస్తామని చెప్పారు. గత ఫిర్యాదుల స్థితిగతుల కోసం ప్రజలు 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు వెంకటప్ప ఆదివారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.