VSP: వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ మార్చి 4న ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు పి. నారాయణ్ తెలిపారు. ఆ రోజు ఉదయం విజయవాడలో శాంతియుత ర్యాలీ నిర్వహించి అనంతరం సభ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
GNTR: గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మొత్తం 165 ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.
ATP: చెన్నైలో నిర్వహించిన 10వ అంతర్జాతీయ అబాకస్ పోటీల్లో తాడిపత్రి ప్రణవ్ అబాకస్ విద్యార్థులు అద్భుత ప్రతిభ చాటారు. 10 వేల మంది పాల్గొన్న ఈ పోటీల్లో ప్రణవ్ ఇన్స్టిట్యూట్ నుంచి 42 మంది విద్యార్థులు కేవలం 10 నిమిషాల్లో 200 గణిత ప్రశ్నలను సాధించారు. వీరిలో 8 మంది ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్, 20 మంది ఛాంపియన్స్, 14 మంది టాపర్స్‌గా నిలిచారు.
సత్యసాయి: మెళవాయి గ్రామంలో దీర్ఘకాలంగా ఉన్న తాగునీటి సమస్యను మడకశిర MLA ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పరిష్కరించారు. గ్రామంలో నీటి ఎద్దడి దృష్ట్యా కొత్త బోరు వేయించి, మోటారు పంపు సెట్ బిగించడంతో పాటు పైపులైన్ పనులు పూర్తి చేయించారు. పీ. కుంచిటిగ వక్కలిగ కార్పొరేషన్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ, స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
NDL: దోమల నివారణ పై చర్యలు చేపట్టి విష జ్వరాల బారిన పడకుండా ప్రజలను కాపాడాలని CPM పార్టీ పట్టణ కార్యదర్శి ఏ. రణదీర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆత్మకూరు పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామ్ నాయక్ మాట్లాడుతూ.. పారిశుధ్య పనులు చేపట్టడం ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
W.G: ప్రజా ఫిర్యాదులను నాణ్యతతో, వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ జీ. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 262 వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, డీఆర్వో రామునాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం: వికారాబాద్‌లోని ఓ రిసార్ట్స్ లో జరుగుతున్న ఏపీ & తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ శిక్షణ శిబిరంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ హాజరవ్వగా, ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యక్రమాల గురించి జిల్లా అధ్యక్షులు షేక్ సైదాను అడిగి తెలుసుకున్నారు. సంస్థ గత నిర్మాణాల గురించి రాహుల్‌కు వివరించారు.
కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని ఎస్.హెచ్.ఓ (SHO)లు, పోలీస్ సిబ్బంది ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ లేని వారికి జరిమానా విధించారు.
ASR: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శాంత కుమారి కోరారు. ఈమేరకు సోమవారం బీజేపీ జనతా వారధి కన్వీనర్ మినుముల గోపాలపాత్రుడు తదితరులతో జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్‌కు వినతిపత్రం అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో, లిక్కర్ పాలసీలో భారీ ఆర్ధిక కుంభకోణం జరిగిందని ఆరోపించారు.
CTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా, చిత్తూరు II టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నెట్టికాంతయ్య వరదప్ప నాయుడు పాఠశాలలో మహిళల భద్రత అనే అంశంపై వ్యాస రచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. మహిళా సాధికారత, సమాన హక్కులు, విద్య యొక్క ప్రాముఖ్యతపై విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
E.G: కొవ్వూరు TDP కార్యాలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బిషప్ కౌన్సిల్ మెంబెర్స్ సోమవారం కలిశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలో క్రైస్తవుల రక్షణ బాప్తీస్మము పొందుటకు గోదావరి నది ఒడ్డున స్థలము కేటాయించాలని, క్రైస్తవులకు కళ్యాణ మండపం ఏర్పాటు చేయమని కోరుతూ వినతి పత్రం అందించారు. వాటిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.
NLR: ఆత్మకూరు మండలం బట్టేపాడు సొసైటీ భవనంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం అధికారులు ప్రారంభించారు. సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం గిట్టుబాటు ధర కల్పిస్తూ వెంటనే నగదు చెల్లింపు కూడా చేస్తామని రైతులకు అధికారులు వివరించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుంది అని అధికారులు పేర్కొన్నారు.
VZM: డెంకాడ మండలంలో పాఠశాలకు వెళ్లడానికి ప్రమాదపు అంచుల్లో విద్యార్థులు ప్రయాణం సాగిస్తున్నారు. చింతలవలస నుంచి అక్కివరం వెళ్ళే రోడ్డులో ఆటోకు బ్యాగ్‌లను తగిలించి నిర్లక్ష్య దోరణిలో పిల్లలను తీసుకువెళ్తున్నారు. అయితే, ఈ మార్గంలో భారీ వాహనాలు ఎక్కువగా తిరుగుతుంటాయి. స్కూల్ పిల్లల ఆటోలపై పోలీసులు, ఆర్టీవో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
ATP: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి అనారోగ్యంతో అనంతపురం సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సోమవారం ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. హనుమంతరాయ చౌదరి కుమారుడు, టీడీపీ నాయకులు ఉన్నం మారుతీ చౌదరితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
W.G: పాలకొల్లు డామ్ పేటకు చెందిన కందికట్ల రాకేష్ (26) కువైట్ దేశంలో మృతి చెందారు. 8 నెలలు క్రితం కువైట్ వెళ్లిన రాకేష్ కూలి పనులకు వెళ్తుంటాడు. ఆదివారం అనారోగ్యంగా ఉండడంతో స్నేహితులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కువైట్లోనే ఉంటున్న రాకేష్ తల్లి రమణకు సమాచారం ఇచ్చారు.