కమ్యూనిస్ట్‌లు చారిత్రక తప్పిదాలు చేస్తుంటారు.. అలా ఎందుకంటారో మరోసారి నిరూపితమైందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్‌తో పాటు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరాయి విజయన్, అఖిలేష్ యాదవ్, డీ రాజా, తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా ఆవిర్భావ సభలో ఎవరైనా తాము ఏం చేయదల్చుకున్నామో చెబుతారు.. కానీ ఈ సభలోని ప్రముఖులంతా కేవలం మోడీని, బీజేపీని మాత్రమే టార్గ...
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అబద్ధానికి ప్యాంట్ షర్ట్ వేస్తే జగన్ రెడ్డిలా ఉంటుందని ఆరోపించారు. ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు అని, అందుకే అబద్ధాల రెడ్డి అని పేరు పెట్టానన్నారు. మద్యపాన నిషేధం అబద్ధం, రూ.3 వేల పెన్షన్ అబద్ధం, జాబ్ క్యాలెండర్ అబద్ధం, ప్రత్యేక హోదా అబద్ధం, జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని నారా లోకేశ్ స్పష్టం చేశార...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ.500 నోట్లు, రూ.2000 నోట్లను దాచిపెడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. ఇటీవల 500, 2000 నోట్ల రూపాయలు కనిపించడం లేదని, అన్నీ జగన్ ఇంటికి వెళ్లిపోయాయన్నారు. ఆ నోట్లను ఎక్కడికెక్కడికో పంపించ...
కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే సైన్యానికి సంబంధించి అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం స్పష్టం చేశారు. తాము పాత పద్ధతిలోనే దానిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. సైన్యానికి ఒక పద్ధతి అంటూ ఉండాలన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభలో మాట్లాడారు. బీజేపీ మతవిద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తోందని, వాటిని ...
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు పదవీ గండం పొంచి ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల కోటాలో తన కుమారుడు లోకేశ్ కు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై తొలిసారి చట్టసభల్లోకి అడుగు పెట్టాడు లోకేశ్. ఆ వెంటనే చంద్రబాబు కుమారుడికి మంత్రి బాధ్యతలు అప్పగించాడు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోవడంతో లోకేశ్ మంత్రి పదవి కోల్పోయి కేవల...
భారత్ ఎటువైపు వెళ్తుందనే ఆలోచన తనను ఎంతోకాలంగా వేధిస్తోందని, అసలు మనకంటూ ఓ లక్ష్యం ఉందా అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ఎవరినీ అడిగే అవసరం లేని, ఏ ప్రపంచ బ్యాంకు వద్ద అప్పు చేయని విధంగా, ఏ విదేశం నుండి అప్పు తీసుకోకుండా మన వద్ద సహజ సంపద వనరులు ఉన్నాయన్నారు. దేశంలోని లక్షల కోట్ల ఆస్తి మన దేశ […]
ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీ మీద విరుచుకుపడ్డారు. మోడీకి దేశ అభివృద్ధి గురించి ధ్యాస లేదన్నారు. ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులపైకి ఈడీ, సీబీఐ దాడులు చేసేందుకు కుట్రలు చేస్తారు. ఎమ్మెల్యేలను కొనడం, విపక్ష పార్టీల ప్రభుత్వాలను పడగొట్టాలనే ఆలోచిస్తుంటారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. బీజేపీ దేశాన్ని భ్రష్టు పట్టించేందుకు వచ్చిందని విమర్శించ...
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ఆంధ్రప్రదేశ్ లో చిచ్చు రేపింది. దావోస్ లో ప్రపంచ ఆర్థిక ఫోరమ్ వార్షిక సదస్సు జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు జరుగుతుంది. దీనికి మంత్రి కేటీఆర్ తన టీమ్ తో హాజరయ్యాడు. అక్కడ తెలంగాణ పెవిలియన్ ఏర్పాటుచేశారు. ప్రభుత్వ విధానాలు వివరిస్తూ తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వివిధ కంపెనీలు, పారిశ్రామికవేత్తలను కోరుతున్నారు. ఈ కేటీఆర్ పర్యటనకు అనూహ్య స్పందన వస్...
పుష్పగుచ్ఛంలో అన్నిరకాల పూలు ఉంటేనే బాగుంటుందని, కానీ బీజేపీకి ఒకే రంగు పూవు ఉండాలని ఇది సరికాదని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎద్దేవా చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మం సభ దేశ రాజకీయాల్లో తొలి మార్పుకు సంకేతమన్నారు. మనం దేశం అందమైన పూలమాల వంటిదని, అందులో అన్ని రకాల పూవులు ఉంటాయని, కానీ బీజేపీకి ఒకే రంగు పూలు కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. బీజేపీ కొన్నిచోట్ల దొడ్డిదారిన ...
గణతంత్ర భారతం ఇప్పుడు ప్రమాదంలో ఉందని, అందుకే బీజేపీని ఓడించడమే మన ముందున్న టాస్క్ అని కమ్యూనిస్ట్ నేత డీ రాజా పిలుపునిచ్చారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ, ఆరెస్సెస్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరన్నారు. భారత్ లౌకికవాద దేశమని కానీ బీజేపీ హిందూ దేశంగా మార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రజలకు విద్య, ఉద్యోగం కనీస అవసరాలు అన్నారు. కానీ బీజేపీ వీటిని పక్కన పెట్టి మతాన్ని బీజేపీ ఉప...
బీజేపీని తరిమికొట్టే కార్యక్రమం తెలంగాణ నుండి ప్రారంభం కావాలని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. తాను ఇంత పెద్ద సభను ఎప్పుడూ చూడలేదన్నారు. విపక్ష నేతలను బీజేపీ వేధిస్తోందని ఆరోపించారు. విపక్ష నేతలను బీజేపీ వేధిస్తోందన్నారు. ప్రతిపక్షాలపై దర్యాఫ్తు సంస్థలను వినియోగిస్తూ, జేబు సంస్థగా ఉపయోగించుకుంటున్నాయన్నారు. మోడీ ప్...
ఏపీలో ఆర్ఆర్ఆర్ రికార్డును వాల్తేరు వీరయ్య బద్దలు కొట్టింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో వింటేజ్ లుక్ లో చిరు అదిరిపోయారు. మొత్తానికి తన సినిమాతో ఫ్యాన్స్ కు చిరు పూనకాలు తెప్పించాడు. ఇందులో చిరు కామెడీ టైమింగ్స్ కూడా అదుర్స్ అంటూ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. తొలి ర...
ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ పెడరల్ స్ఫూర్తికి భిన్నంగా పాలన సాగిస్తోందని ఆరోపించారు. కార్పోరేటర్లకు కొమ్ము కాస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సి ఉందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ అద్భుతంగా పోరాడుతున్నారని, ఈ పోరాటం తెలంగాణ నుండే ప్రారంభం కావాలన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు అందరూ బీజేపీకి వ్యతి...
జాతీయ రాజకీయాలే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శరవేగంగా అడుగులు వేస్తున్నారు. దీనికోసం భారీ కార్యాచరణ రూపొందిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలకు ఏడాదిన్నర కూడా సమయం లేకపోవడంతో తన ప్రణాళికల్లో వేగం పెంచుతున్నారు. ఖమ్మం సభ ఊహించని రీతిలో నిర్వహించి సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొత్త ఆసక్తిని రేకెత్తించారు. ఉద్దేశపూర్వకంగానే సరిహద్దు జిల్లా ఖమ్మంలో సభ నిర్వహించి ఏపీలో బీఆర్ఎస్ పై సరికొత్త చ...
తెలుగుదేశం కేవలం ఓ పార్టీ మాత్రమే కాదని, ఇది ఒక పెద్ద వ్యవస్థ అని ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. టీడీపీకి ఉన్న కార్యకర్తలు మరే పార్టీకి లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదన్నారు. దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, సుహాసిని, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆ...