»Kcr Arvind Kejriwal Bhagwant Mann D Raja Akhilesh Yadav Pinarayi Vijayan Khammam Brs Khammam Public Meeting Narendra Modi Bjp Kerala Punjab Delhi %e0%b0%95%e0%b1%87%e0%b0%b8%e0%b1%80
మోడీ గారూ! మీ పాలసీ అదేనా.. నన్ను వేధిస్తోంది: కేసీఆర్ హెచ్చరిక
భారత్ ఎటువైపు వెళ్తుందనే ఆలోచన తనను ఎంతోకాలంగా వేధిస్తోందని, అసలు మనకంటూ ఓ లక్ష్యం ఉందా అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ఎవరినీ అడిగే అవసరం లేని, ఏ ప్రపంచ బ్యాంకు వద్ద అప్పు చేయని విధంగా, ఏ విదేశం నుండి అప్పు తీసుకోకుండా మన వద్ద సహజ సంపద వనరులు ఉన్నాయన్నారు. దేశంలోని లక్షల కోట్ల ఆస్తి మన దేశ ప్రజల సొత్తు అన్నారు. అమెరికా, చైనా కంటే మన వద్ద సాగుభూమి ఎక్కువగా ఉందని, మనకు అపార జల సంపద ఉందని, అయినప్పటికీ కందిపప్పును, పామాయిల్‌ను దిగుమతి చేసుకునే పరిస్థితి ఏమిటన్నారు. అద్భుతమైన పంటలు పండే అవకాశమున్నా, మనం ఆహార ఉత్పత్తులను ఇంకా దిగుమతి చేసుకుంటున్నామని, అందుకే మనం ఇంకా యాచకులుగానే మిగిలిపోయామన్నారు.
చైనా సహా వివిధ దేశాల్లో అత్యంత నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు ఉన్నాయని, మన దేశంలో ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. ఎంతో నీరు సముద్రం పాలు అవుతుంటే, రాష్ట్రాలు మాత్రం నీటి కోసం ఎందుకు కొట్లాడాలో చెప్పాలన్నారు. పరిపాలన చేయలేక ఇలాంటి ఇబ్బందులు అన్నారు. ఇప్పటి వరకు ప్రజలు వంచించబడ్డారని, ఈ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పుట్టుకు వచ్చిందన్నారు. ఖమ్మం ఈ బహిరంగ సభ దేశంలో ప్రబలమైన మార్పుకు సంకేతమన్నారు. చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం పూర్తి కాలేదా అని ప్రశ్నించారు. ఇలాంటి సమస్యల నుండి భారత జాతిని విముక్తం చేసేందుకు పుట్టిందే బీఆర్ఎస్ అన్నారు. ప్రస్తుత భారత పరిస్థితికి, ఈ దుర్మార్గానికి కారణం ఎవరో తెలియదా.. కాంగ్రెస్, బీజేపీ అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తామని, కష్టాల నుండి బయటకు తీసుకు వస్తామన్నారు.
బీఆర్ఎస్ ఆలోచన కలిగిన పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే రెండేళ్లలో దేశం వెలుగుజిలుగుల భారత్‌గా నిలిచేదన్నారు. ఇంత భూమి, ఇంత సంపద ఉన్నప్పటికీ దేశంలో రైతుల ఆత్మహత్యలు సిగ్గుపడాల్సిన విషయమన్నారు. భారత్ సంపదను తమకు ఇష్టమైన వారికి బీజేపీ దోచిపెడుతోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లేదా బీఆర్ఎస్ ప్రతిపాదించే ప్రభుత్వం వస్తే తెలంగాణలా దేశాన్ని తీర్చిదిద్దుతామన్నారు. రైతు బంధును దేశవ్యాప్తంగా అమలు చేయాలనేదే బీఆర్ఎస్ డిమాండ్ అన్నారు. బీజేపీ పెట్టుబడిదారు, దోపిడీదారు ప్రభుత్వం అన్నారు. కార్పోరేట్ల పేరుతో రూ.11 లక్షల కోట్ల నుండి రూ.14 లక్షల కోట్లను ఎన్పీఏల రూపంలో నష్టం చేశారన్నారు. ఈ అసమర్థ పాలకులు మనకు అవసరమా అన్నారు. కరెంట్ ఇవ్వరు, తాగునీరు ఇవ్వరు.. ఇంకా వీరు ఎందుకన్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లుగా దేశం పరిస్థితి తయారయిందన్నారు.
మోడీ గారూ.. మీ పాలసీ ప్రయివేటైజేషన్ అయితే, మా పాలసీ నేషనలైజేషన్ అన్నారు. మీరు నిత్యం ప్రభుత్వ సంస్థల్ని అమ్ముతా అంటున్నారని, అయితే అమ్మేసుకో… 2024లో మీరు ఇంటికి, మేం ఢిల్లీకి వస్తామని, అప్పుడు గ్యారెంటీగా ఎల్ఐసీని వాపస్ తీసుకుంటామన్నారు. కార్పోరేట్లకు ఎల్ఐసీని అమ్మేస్తానని ఉవ్విళ్లూరుతున్నారని, ఉద్యోగులు, కార్మికులు, ఏజెంట్లు పిడికిలి ఎత్తి రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్ఐసీ ఉద్యోగులు సింహాల్లా గర్జించాలన్నారు. మనం ఇంకా ఎంతకాలం మోసపోవాలని ప్రశ్నించారు. దళితబంధు పథకాన్ని దేశమంతా అమలు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కును ప్రయివేటీకరించినా, తాము అధికారంలోకి వచ్చాక జాతీయం చేస్తామన్నారు. కరెంట్ రంగాన్ని కూడా పబ్లిక్ సెక్టార్లో ఉంచుతామని చెప్పారు. మనవద్ద మేకిన్ ఇండియా, జోకిన్ ఇండియా అయిపోయిందన్నారు. పేరుకే మేకిన్ ఇండియా అని, కానీ అన్నీ చైనా నుండి వస్తాయన్నారు.