»Padmavathi Ammavari Karthika Brahmotsavam From November 10
Sri padmavathi Ammavari: కార్తీక బ్రహ్మోత్సవాలు..నవంబర్ 10 నుంచి షురూ
తిరుమల తిరుపతిలో ఇటివల నవరాత్రి ఉత్సవాలు ఘనంగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 10 నుంచి శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. అందుకోసం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించగా..టిక్కెట్లును కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
padmavathi Ammavari Karthika Brahmotsavam from November 10
తిరుమలలో ఈ ఏడాది జరిగే వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు తిరుచానూరులోని ప్రముఖ శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం ముస్తాబైంది. నవంబర్ 10 నుంచి నవంబర్ 18 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పలు రకాల కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో నవంబర్లో అంకురార్పణం సన్నాహక కార్యక్రమంలో సేనాధిపతి (విశ్వక్సేనుడు) ఊరేగింపు నాలుగు మాడ వీధుల చుట్టూ ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. మరోవైపు డిసెంబర్ 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 1 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 2.25 లక్షల రూ.300 దర్శన టికెట్లను నవంబర్ 10న విడుదల చేస్తామని ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు.
తిరుచానూరు బ్రహ్మోత్సవం 2023 షెడ్యూల్:
నవంబర్ 09 – లక్ష కుంకుమార్చన (ఉదయం), సేనాపతి ఉత్సవం, అంకురార్పణ (రాత్రి)
నవంబర్ 10 – ద్వజారోహణం, చిన్న శేష వాహనం
నవంబర్ 11 – పెద్ద శేష వాహనం, హంస వాహనం
నవంబర్ 12 – ముత్యపు పందిరి, సింహ వాహనం
నవంబర్ 13 – కల్ప వృక్ష, హనుమంత వాహనం
నవంబర్ 14 – పల్లకీ ఉత్సవం, వసంతోత్సవం, గజ వాహనం
నవంబర్ 15 – సర్వ భూపాల వాహనం, బంగారు రథం, గరుడ వాహనం
నవంబర్ 16 – సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
నవంబర్ 17 – రథోత్సవం, అశ్వ వాహనం
నవంబర్ 18 – చక్రస్నానం, పంచమీ తీర్థం, ద్వజావరోహణం
నవంబర్ 19 – పుష్ప యాగం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.