టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం పదో రోజుకు చేరుకుంది. నేడు పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రి మంగసముద్రంలో బస చేస్తారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. రాష్ట్రంలోని ఆడ బిడ్డలు క్షేమంగా ఉండేది టీడీపీ పాలనలోనే అన్నారు. జగన్కు ఒక్క ఛాన్సు ఇస్తే రాష్ట్రాన్ని ఏ దుస్థితిలోకి తీసుకొచ్చారో చూస్తూనే ఉన్నామని చెప్పారు. పెన్షన్లు తీసేయడం, మద్యపాన నిషేధం చేస్తానని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు షాపులను, రేట్లును పెంచుతూ పోతున్నాడన్నారు. రాష్ట్రంలో 900 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగితే దిశ చట్టం కింద ఒకరికీ న్యాయం జరగలేదని ఆరోపించారు. సొంత బాబాయి కూతురికి, అమ్మకు, చెల్లికి న్యాయం చేయని జగన్ రాష్ట్రంలోని మహిళలకు ఏం న్యాయం చేస్తారన్నారు.