టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) యువగళం పాదయాత్ర మళ్లీ వాయిదా పడింది. అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు వాదనలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ ప్రకటించింది.
Files missing in former minister Talasanis OSD Kalyan office masab tank
తెలుగుదేశం పార్టీ (TDP) ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) యువ గళం పాదయాత్ర(Yuvagalam padayatra) మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు విషయంలో వాదనలు ఉన్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ ప్రకటించింది. పాదయాత్ర పున: ప్రారంభ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. అయితే అంతకు ముందు ఈ నెల 29న పాదయాత్రను ప్రారంభించే విషయంపై ఢిల్లీలో వెల్లడిస్తానని ప్రకటించారు. కానీ ఆలోపే తాజాగా ప్రకటించారు.
మరోవైపు తన తండ్రికి ముందస్తు బెయిల్ వచ్చేంత వరకు తాను ఆంధ్రప్రదేశ్‌కి రానని నారా లోకేష్ గతంలో వ్యాఖ్యానించారు. అంతేకాదు నారా లోకేశ్ ఢిల్లీని వదిలి వస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉందని పలువురు వైసీపీ వర్గాలు అంటున్నాయి. అందుకే ఢిల్లీ నుంచి బయటకు రాలేకపోతున్నాడని చెబుతున్నారు. లోకేష్ ను అరెస్టు చేసినా కూడా ఏమి ఇబ్బంది ఉండదని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. మరింత మంది ప్రజల సానుభూతి పొందే అవకాశం ఉందంటున్నారు. అది ఆయనకు మేలు చేస్తుందని పలువురు టీడీపీ నేతలు భావిస్తున్నారు.