»Nara Lokesh Will Reveal The Facts In The Press Meet Tomorrow
Nara Lokesh: రేపు ప్రెస్ మీట్లో వాస్తవాలు బయటపెడుతానన్న నారా లోకేశ్
టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) యువగళం పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా ఆదివారం పీలేరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన లోకేశ్ కు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారా లోకేశ్(Nara Lokesh) మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(Jagan) విశాఖలో పెట్టింది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కాదని, లోకల్ ఫేక్ సమ్మిట్ అని విమర్శలు గుప్పించారు. యువగళం పాదయాత్రలో భాగంగా పీలేరులో నిర్వహించిన బహిరంగసభకు జనం పోటెత్తడం ఆనందంగా ఉందన్నారు.

విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినవాళ్లు గిఫ్టుల కోసం కొట్టుకున్నారని నారా లోకేశ్(Nara Lokesh) ఎద్దేవా చేశారు. కాగితాల్లేకుండా ఫేక్ ఎంవోయూలు చేసుకున్నారని, సోమాలియాలో కూడా భోజనం, గిఫ్టుల కోసం అలా కొట్టుకోరని విమర్శించారు. ఇండోసోల్ అనే కడపకు చెందిన జగన్ బినామీ కంపెనీ రూ.76 వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు కలరింగ్ ఇచ్చినట్లు ఆరోపించారు. ఆ కంపెనీ పేరుతో 25 వేల ఎకరాల భూములు కొట్టేయడానికి ప్లాన్ వేశారని, కానీ నెట్ లో కొట్టి చూస్తే ఆ కంపెనీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కేవలం లక్ష రూపాయలు మాత్రమేనని బయటపడినట్లు గుర్తు చేశారు. అన్ని వాస్తవాలను రేపు ప్రెస్ మీట్ పెట్టి బయటపెడుతానని నారా లోకేశ్(Nara Lokesh) తెలిపారు.