»Nara Bhuvaneswari State Should Get Independence Again
Nara Bhuvaneswari: రాష్ట్రానికి మళ్లీ స్వాతంత్య్రం రావాలి
బ్రిటిష్ పాలనలో అవమానాలు, హింస ఉండేవి. మళ్లీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో చూస్తున్నామని భువనేశ్వరి అన్నారు. మన రాష్ట్రానికి మళ్లీ స్వతంత్య్రం రావాలి.. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలి. దీనికోసమే ప్రజల్లో ఉంటామని తెలిపారు.
Nara Bhuvaneswari: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరి మే 10 వరకు ప్రజల్లోనే ఉంటానని తెలిపారు. బ్రిటిష్ పాలనలో అవమానాలు, హింస ఉండేవి. మళ్లీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో చూస్తున్నామని భువనేశ్వరి అన్నారు. మన రాష్ట్రానికి మళ్లీ స్వతంత్య్రం రావాలి.. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలి. దీనికోసమే ప్రజల్లో ఉంటామని తెలిపారు. కేసులు, అరెస్టులతో ప్రజల కోసం కష్టపడుతున్న నాయకుడిని ఇబ్బంది పెడుతుంటే ఈ రాజకీయాలు అవసరమా? అని బాధ కలిగింది. కానీ ప్రభుత్వ వ్యతిరేకత, రాష్ట్ర పరిస్థితులు చూశాక చంద్రబాబు పోరాటం తప్పనిసరని అనిపించిందని.. ఆయన జీవితం రాష్ట్రానికి, ప్రజలకు అంకితమని భువనేశ్వరి తెలిపారు.
జైల్లో చంద్రబాబును చూసిన సంఘటన జీవితంలో మరిచిపోలేను. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నాయకుడిని ఖైదీలా చూసి తట్టుకోలేకపోయా. జైల్లో ఉన్న అతనిలో ఆత్మవిశ్వాసం తగ్గలేదని ఆమె అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమాన్ని గుర్తు చేసుకుని అలాంటిదే ఇది ఒకటని అనుకున్న అని భువనేశ్వరి అన్నారు. స్వాతంత్య్రం కోసం ఏ తప్పు చేయని వాళ్లు జైలుకు వెళ్లారు. రాష్ట్రం కోసం చంద్రబాబు వెళ్లాల్సి వచ్చిందన్నారు.