Mudragada Padmanabham: Will change my name if I can't beat Pawan Kalyan!
Mudragada Padmanabham: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించలేకపోతే అతని పేరు మార్చుకుంటానని సవాల్ చేశారు. పవన్ కళ్యాణ్‌ను తప్పక ఓడిస్తాను. ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు ముద్రగడ పద్మనాభం కాదని.. పద్మనాభరెడ్డి అని మార్చుకుంటానని తెలిపారు. పవన్‌కి అవగాహన లేని విషయాల్లో మాట్లాడుతున్నారని విమర్శించారు.
తుని రైలు దహనం జరిగినప్పుడు జ్యోతుల నెహ్రు వైసీపీలోనే ఉన్నాడని, తుని రైలు సంఘటని చంద్రబాబు కారణమని తెలిపారు. ఈవిషయం పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలన్నారు. కాపు ఉద్యమానికి ఎప్పుడు మద్దతు ఇవ్వలేదు కానీ.. వైసీపీ కాపు ఎమ్మెల్యేలను తిట్టే హక్కు పవన్‌కి లేదన్నారు. కాపుల కోసం రోడ్డు ఎందుకు ఎక్కలేదని ముద్రగడ ప్రశ్నించారు. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం ఎందుకు పారిపోయి వచ్చాడని, అసలు పవన్ కళ్యాణ్ అడ్రస్ ఏంటన్నారు. సినిమాల్లో నటించాలి.. కానీ రాజకీయాల్లో కాదని ముద్రగడ అన్నారు.