నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనపై మంత్రి రోజా స్పందించారు. ఈ ఘటన తనను ఎంతగానో బాధపెట్టిందని ఆయన అన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగానే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని ఆమె మండిపడ్డారు. చిన్న ఇరుకైన సందులో సభ పెట్టడం వల్లే…ఈ ప్రమాదం జరిగిందని ఆమె అన్నారు. ఇరుకైన సందులో పెట్టి.. ఎక్కువ మంది జనం వచ్చినట్లు నమ్మించే ప్రయత్నం చేశారని ఆమె మండిపడ్డారు. ఈ ఘటనను కోర్టు సుమోటోగా తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
చంద్రబాబుని ఏ-1ముద్దాయిగా చేర్చి.. హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇది చంద్రబాబు రాజకీయంగా చేసిన హత్య అని.. మృతి చెందిన ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయలు.. గాయపడిన వారికి కోటి రూపాయలు చొప్పున టీడీపీ చెల్లించాలన్నారు.
ఇదిలా ఉండగా…. బుధవారం రాత్రి కందుకూరులో నిర్వహించిన చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి 8మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆత్మకూరుకు చెందిన దేవినేని రవీంద్ర (73), గుడ్లూరు మండలం గుళ్లపాలేనికి చెందిన యు.పురుషోత్తం (70), కందుకూరు మండలం కొండముడుసుపాలేనికి చెందిన కలవకూరి యానాది (55), అమ్మవారిపాలేనికి చెందిన చిన్నకొండయ్య (52), కందుకూరుకు చెందిన కాకుమాని రాజా(48), ఉలవపాడు మండలం వరిగచేనుసంగానికి చెందిన యాకసిరి విజయ (45), ఓగూరుకు చెందిన గడ్డం మధుబాబు (44), ఈదుమూరి రాజేశ్వరి (40) లు ఉన్నారు.