Minister Amarnath: ఏపీ మంత్రి అమర్ నాథ్ (Minister Amarnath) హాట్ కామెంట్స్ చేశారు. దసరాకు విశాఖ ప్రజల కల నెరవేరబోతుందని అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పార్టీ నాయకత్వం కోరుకున్న శుభపరిణామం జరగబోతుందని హింట్ ఇచ్చారు. దసరాకు సీఎం జగన్ విశాఖ రాబోతున్నారని ఇండైరెక్టుగా చెప్పేశారు. ఏపీ పరిపాలనా రాజధాని విశాఖ అని జగన్ సర్కార్ పదే పదే చెబుతోన్న సంగతి తెలిసిందే. అంటే దసరా నుంచి విశాఖలో జగన్ ఉంటారని అర్థమవుతోంది.
విశాఖలో ఇప్పటికే రూ.వెయ్యి కోట్ల విలువ గల పనులకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. పార్టీ కోసం పనిచేసని వారికి న్యాయం జరుగుతుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు/ నేతలు పార్టీని వీడలేదని తెలిపారు. కొందరు స్వార్థంతో వెళ్లిన వారు ఎవరో మీకు తెలుసు అని అన్నారు. వారు తప్ప.. అందరూ మనతోనే ఉన్నారని పేర్కొన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి అన్యాయం చేసిన నలుగురిపై వేటు వేసిన ధైర్యం సీఎం జగన్‌దేనని వివరించారు.
దసరాకు కల నెరవేరబోతుందని అమర్ నాథ్ (Amarnath) చెప్పారే కానీ.. ఏం చేస్తారో చెప్పలేదు. సీఎం జగన్ దసరా నుంచి విశాఖ నుంచి పరిపాలన చేస్తారా.? లేదంటే విశాఖకు చెందిన వైసీపీ శ్రేణులకు నామినెటేడ్ పదవులు ఇస్తారా..? అనే సందేహాలు నెలకొన్నాయి. ఏం జరుగుతుందో తెలియాలంటే.. దసరా పండుగ వరకు ఆగాల్సిందే.