E. G: మారేడుమిల్లి మండలంలోని జలతరంగిణి జలపాతం వద్ద ఆదివారం ముగ్గురు మెడికల్ విద్యార్థులు గల్లంతవగా.. ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా మరో విద్యార్థి హరదీప్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం రంపచోడవరం ఏఎస్పీ జగదీష్ ఆడహాలి డ్రోన్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు విద్యార్థి ఆచూకీ లభ్యం కాలేదు.