HYD: ఖైరతాబాద్ పరిధి శ్రీరాంనగర్ పార్క్ అభివృద్ధికి రంగం సిద్ధమైంది. త్వరలోనే గ్రీన్ స్పేస్ పార్కులా తీర్చిదిద్దనున్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు సందర్శించి పరిస్థితులను అంచనా వేశారు. ఈ పార్కులో ల్యాండ్ స్కేపింగ్, పెయింటింగ్, పిల్లలు ఆడుకునే స్థలం, ఆట వస్తువులు, వాచ్మెన్ రూమ్, సెక్యూరిటీ రూమ్, బోర్ వెల్ అందుబాటులోకి తేనున్నారు.