NLG: మిర్యాలగూడలోని ఇవాళ ఉదయం పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కుళ్లిపోయిన ఆహార పదార్థాలను గుర్తించి నిబంధనలు పాటించని హోటళ్లను సీజ్ చేశారు. పరిశుభ్రత లోపాలు ఉన్న హోటళ్లకు జరిమానా కూడా విధించారు. ప్రజల ఆరోగ్య దృష్ట్యా హోటల్ల్లో పరిశుభ్రత పాటించాలని వారు సూచించారు.