భారత్ జల వనరులను ఆయుధంగా మారుస్తోందని ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాక్ దౌత్యవేత్త అబ్బాస్ ఆరోపించారు. దీనికి భారత దౌత్యవేత్త అనుపమ సింగ్ గట్టిగా బదులిచ్చారు. 1960లో సోదరభావం, స్నేహపూర్వకమైన సంబంధాలు అనే ప్రాతిపదికన సింధు జలాల ఒప్పందం జరిగిందని తెలిపారు. కానీ, ఇప్పుడు పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఆ దేశం ఉద్దేశపూర్వకంగా ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్నారు.