venkata ramana joined to ysrcp:టీడీపీకి షాక్.. వైసీపీలోకి చేరిన వెంకట రమణ
jayamangala venkata ramana joined to ysrcp:తెలుగుదేశం పార్టీకి మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ (jayamangala venkata ramana) షాక్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే, కైకలూర్ నియోజకవర్గ ఇంఛార్జీగా వెంకటరమణ వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ (cm jagan) సమక్షంలో ఈ రోజు వైసీపీలో చేరారు. జయమంగళ వెంకట రమణకు జగన్ కండువా కప్పి స్వాగతం కలికారు.
jayamangala venkata ramana joined to ysrcp:తెలుగుదేశం పార్టీకి మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ (jayamangala venkata ramana) షాక్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే, కైకలూర్ నియోజకవర్గ ఇంఛార్జీగా వెంకటరమణ వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ (cm jagan) సమక్షంలో ఈ రోజు వైసీపీలో చేరారు. జయమంగళ వెంకట రమణకు జగన్ కండువా కప్పి స్వాగతం కలికారు. టీడీపీ (tdp) హై కమాండ్‌పై వెంకట రమణ అసంతృప్తితో ఉన్నారు. తనకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని భావిస్తున్నారు. ఇంతలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (karumuri nageshwar rao) రంగంలోకి దిగి వెంకట రమణతో చర్చలు జరిపారు.
వెంకట రమణకు (venkata ramana) ఎమ్మెల్సీ (mlc) పదవీ ఇచ్చేందుకు సీఎం జగన్ (jagan) అంగీకరించారని తెలిసింది. అందుకే ఆయన వైసీపీలో చేరారని తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో ఓ ఎమ్మెల్సీ (mlc) స్థానం ఖాళీ అవుతుంది. ఆ సీటును సీఎం జగన్ వెంకట రమణకు కేటాయించారట. భద్రతను కూడా పెంచింది. నలుగురు గన్ మెన్లను (four gunman) కేటాయించింది.
ఏపీలో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటినుంచే ప్రధాన పార్టీల నేతలు జనంలోకి వెళుతున్నారు. నారా లోకేశ్ (nara lokesh) యువగళం పేరుతో పాదయాత్ర చేపడుతున్నారు. పవన్ కల్యాణ్ (pawan kalyan) వారాహి వాహనంలో రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ కూడా ప్రజలతో మమేకం అవుతున్నారు. ఆయా నియోజకవర్గల్లో ఆశవాహులు ఇప్పటినుంచే పార్టీ మారుతున్నారు. అలా వెంకట రమణ వైసీపీలో చేరారు.