»Janasena Party Rs Chiranjeevi Gave 5 Crores To Pawan Kalyan
Chiranjeevi: జనసేన పార్టీకి చిరంజీవి భారీ విరాళం
జనసేనానికి చిరంజీవి, రామ్ చరణ్ అండగా నిలవనున్నారు. ఇప్పటికే చిరంజీవి భారీ విరాళం అందించారు. మెగాబ్రదర్స్ కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Janasena party Rs. Chiranjeevi gave 5 crores to Pawan Kalyan
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీ కోసం భారీ విరాళం ప్రకటించారు. ఈ మేరకు రూ.5 కోట్ల చెక్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అందించారు. మెగాబ్రదర్స్ కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చిరంజీవి విశ్వంభర చిత్రం షూటింగ్ సమయంలోనే ఈ సంఘటన జరిగింది. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతం ముచ్చింతల్‌లో షూటింగ్ జరుపుకొంటుంది. ఆయన్ను కలవడానికి పవన్ కల్యాణ్, నాగబాబు షూటింగ్ లొకేషన్‌కు వెళ్లారు.
ఇద్దరు తమ్ముళ్లు వచ్చిన సందర్భంగా చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. వారితో పార్టీ ప్రచారం గురించి, ఆంధ్ర పాలిటిక్స్ గురించి చర్చినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా జనసేన పార్టీకి ఆయన ఆశీస్సులతో పాటు రూ.5 కోట్ల చెక్‌ను పవన్ కల్యాణ్‌కు అందజేశారు. పార్టీకి అండగా ఉన్నందుకు పవన్ కాస్త భావోద్వేగానకిి గురై చిరంజీవికి పాదాభివందనం చేశారు. అయితే ఆదివారం అనకాపల్లిలో పవన్ వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సభలో పవన్ అమ్మవారి ఆశీస్సులు కోరుతూ చేసిన వ్యాఖ్యలకు చిరంజీవి కదిలిపోయారు. వెంటనే తన తమ్ముడికి ఆర్థికంగా అండగా ఉండాలని ఈ భారీ విరాళం అందించారు. రామ్ చరణ్ సైతం జనసేనకు అండగా ఉండేందుకు సిద్ధం అయినట్లు సమాచారం.