వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డిని సీబీఐ ఇవాళ విచారించింది. అవినాష్ రెడ్డి ఫోన్‌కాల్ డేటా ఆధారంగా సుమారు ఆరున్నర గంట పాటు కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో ఈ విచారణ జరిగింది. కాగా, నవీన్ ను రహస్యంగా విచారించినట్టు తెలుస్తోంది. విచారణ ముగిసిన అనంతరం కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ విజయవాడ వెళ్లిపోయారు. ఇటీవల కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ హైదరాబాదు కార్యాలయంలో విచారించిన సంగతి తెలిసిందే. వివేకా హత్య జరిగిన తర్వాత అవినాశ్ ఫోన్ నుంచి వెళ్లిన కాల్స్ ఆధారంగా కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ లకు సీబీఐ నోటీసులు జారీ చేసింది.