మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సీఎం అయి ఉంటే బాగుండేది అని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ (Chinta Mohan) హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ప్రజలకు చేసింది శూన్యం అంటూ ఆయన విమర్శించారు. ఏపీ రాష్ట్రాన్ని రెండు సామాజిక వర్గాలు 75 ఏళ్లుగా దోచుకుంటున్నాయని చింతామోహన్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ (Congress party) అధికారంలోకి రాగానే ఏపీలో రెండున్నర సంవత్సరాలు కాపులకు అధికారం ఇస్తామని, రెండున్నర సంవత్సరాలు ఓబీసీలకు అధికారం ఇస్తామని చింతామోహన్ తెలిపారు. గతంలో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా చిరంజీవి ముఖ్యమంత్రి అయి ఉంటే బాగుండేది అని చింతా మోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తనకు చిరంజీవి మంచి మిత్రుడు అని తెలిపిన చింతా మోహన్ ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న రాజకీయాలపై పెదవి విరిచారు.నిత్యం సీబీఐ (CBI) కేసులతో ఆంధ్రప్రదేశ్ లో నానా రచ్చ జరుగుతోందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జగన్ నొక్కిన బటన్ నిధులు ఎటువెళుతున్నాయో తెలియదన్నారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు నిధులు, పథకాలు చేరడం లేదని ఆరోపించారు.తప్పనిసరి పరిస్థితుల్లో దళితులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పుకొచ్చారు.వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.