Intense tension in Narasa Rao's house. YCP attack on TDP leader's house
TDP Vs YCP: నరసరావుపేట (Narasa Raopet) లో నేడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద్‌పై (Narasaraopet TDP in-charge Chadalawada Arvind) వైసీపీ దాడికి యత్నించింది. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. వైసీపీ వర్గీయులు దాడి చేసి కిటికీలు, ఫర్నిచర్‌ను పగలగొట్టారు. ఈ నేపథ్యంలో, టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఇరు పక్షాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు.
అక్కడికి నరసరావుపేట టీడీపీ ఇన్చార్జి చదలవాడ అరవింద్ బాబు(Chadalawada aravind), టీడీపీ నేత కడియాల రమేశ్ రాగా, వారి వాహనాలపై దాడి చేశారు. ఈ ఘటనల్లో ఓ పోలీసు జీపు కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. రాళ్లదాడిలో అరవింద్ కారు ధ్వంసం కాగా, డ్రైవర్ కు తీవ్ర గాయాలైయ్యాయి. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అక్కడికి రావడంతో, ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది. మరీ ఇంత జరుగుతున్నా పోలీసు బలగాలు ఏం చేస్తున్నట్లు అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు(Prattipati Pullarao) స్పందించారు.
నరసరావుపేటలో వైసీపీ నేతల దాడిని ఖండిస్తున్నట్టు, ఈ ఘర్షణను పరిశీలిస్తే.. పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టకుండా వైసీపీ నాయకులకు సాయం చేసినట్లు ఉందని ఆరోపించారు. టీడీపీ నేత చల్లా సుబ్బారావు ఇంట్లోకి చొరబడి ధ్వంసం చేయడం దారుణమని పుల్లారావు పేర్కొన్నారు. నిన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై చల్లా సుబ్బారావు విమర్శలు చేయడమే నేటి పరిణామాలకు కారణమని భావిస్తున్నారు.
నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అవినీతి బయట పెట్టినందుకు, వైసీపీ సైకోలు రెచ్చిపోయారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు ఇంటిపై రాళ్ల దాడి చేయటమే కాక, టిడిపి కార్యకర్తలకు గాయాలయ్యేలా విచక్షణా రహితంగా దాడులు చేసారు. టీడీపీ నేత అరవిందబాబు గారి కారును… pic.twitter.com/O8Eni9z69W