»Half Kg Chicken Five Paise Only Offer Price At Atmakur Nellore Ap
half kg Chicken Free: ఐదు పైసలకే అరకిలో చికెన్…ఎగబడ్డ జనం
ఓ చికెన్(Chicken) షాపు(shop) నిర్వహకులు తమ ప్రాంత వాసులకు క్రేజీ ఆఫర్(offer)ను ప్రకటించారు. అరకిలో చికెన్ ఐదుపైసల(five paise coin) నాణానికే ఇస్తామని అనౌన్స్ చేశారు. దీంతో అక్కడి స్థానికులతోపాటు చుట్టుపక్కల జనాలు సైతం పాత ఐదుపైసల నాణాల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. అవి దొరికిన వెంటనే ఆఫర్ ప్రకటించిన చికెన్ షాపుకు వెళ్లి చికెన్ తెచ్చుకున్నారు. ఈ సంఘటన ఏపీ(ap)లోని నెల్లూరు జిల్లా(nellore district) ఆత్మకూరు(atmakur)లో చోటుచేసుకుంది.
ఐదు పైసల నాణానికే(five paise coin) అర కిలో(half kg) చికెన్(Chicken) ఇస్తున్నారంటే నమ్ముతారా? చాలా కష్టం ఎందుకంటే కిలో చికెన్ రేటు ప్రస్తుతం రూ.200లకు పైగా ఉంది. అలా ఎలా ఇస్తారని అనుకుంటారు. కానీ నిజంగానే ఐదుపైసలకు అరకిలో చికెన్ ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇది ఎక్కడో కాదు. ఏపీ(ap)లోని నెల్లూరు జిల్లా(nellore district)లోని ఆత్మకూరు(atmakur)లో జరిగింది.
ఇక అసలు విషయానికి వస్తే ఏపీ నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో 786 చికెన్ షాపు నిర్వహకులు ప్రజలకు సరికొత్త ఆఫర్ ఆదివారం ప్రకటించారు. ఐదుపైసల నాణానికే(five paise coin) హాఫ్ కేజీ చికెన్ ఇస్తామన్నారు. విషయం తెలుసుకున్న అక్కడి స్థానికులు పాత ఐదు పైసల నాణాల కోసం వెతకడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో నాణాలు దొరికిన వారు చికెన్ షాపుకు వెళ్లి కావాల్సినంత మాంసం తెచ్చుకున్నారు. అయితే ఈ ఆఫర్ ఆదివారం(sunday) ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉంటుందని నిర్వహకులు ప్రకటించారు.
అయితే ఆ దుకాణ నిర్వహకులు వారి షాపు పెట్టి 12 ఏళ్లు అయిన సందర్భంగా కొత్తగా ఇంకో దుకాణం(new shop) ఏర్పాటు చేశారు. ఆక్రమంలో వారి షాపు గురించి ఎక్కువ మందికి తెలిసేందుకు ఈ ఆఫర్ పెట్టినట్లు వారు తెలిపారు. ఆ నేపథ్యంలో వారి దుకాణం ముందు ఓ ఫ్లైక్సీ పెట్టి ఐదు పైసల నాణాలకే అరకిలో చికెన్ ఇస్తామని ప్రకటించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ప్రజల(people) నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని నిర్వహకులు చెప్పారు. అయినా ఈరోజుల్లో కూడా ఐదుపైసల నాణాలు ఉన్నాయంటే పలువురు గ్రేట్ అని చెబుతున్నారు. మరికొంత మంది మాత్రం తమకు ఐదు పైసల నాణాలు దొరకలేదని వాపోతున్నారు.