»Calf Died Due To The Brutality Of The Cattle Trader Farmers Are Protest At Kodad Suryapet
Protest: కబేలా వ్యాపారి దౌర్జన్యంతో దూడ మృతి…రైతులు ఆందోళన
ఓ కబేలా బేరగాడి దౌర్జన్యానికి అభం శుభం తెలియని మూగ జీవి మృత్యువాత చెందింది. ఓ రైతు తన ఆర్థిక అవసరాల నిమిత్తం ఓ పశువుల సంతకు వెళితే.. అక్కడి వ్యాపారులు కుమ్మకై ఓ దూడ విషయంలో కర్కషంగా ప్రవర్తించి దాని మృతికి కారకులయ్యారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District)లోని కోదాడ(kodad)లో చోటుచేసుకుంది.
ఓ కబేలా బేరగాడి దౌర్జన్యానికి అభం శుభం తెలియని మూగ జీవి మృత్యువాత చెందింది. ఓ రైతు తన ఆర్థిక అవసరాల నిమిత్తం ఓ పశువుల సంతకు వెళితే.. అక్కడి వ్యాపారులు కుమ్మకై ఓ దూడ విషయంలో కర్కషంగా ప్రవర్తించి దాని మృతికి కారకులయ్యారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District)లోని కోదాడ(kodad)లో చోటుచేసుకుంది.
ఇక వివరాల్లోకి వెళితే హుజుర్ నగర్ కు చెందిన రైతు(Farmer) బత్తుల అంజయ్య తన ఆవు దూడను అమ్మేందుకు సూర్యాపేట జిల్లా కోదాడ పశువుల సంతకు తీసుకెళ్లాడు. ఆ క్రమంలో అక్కడే ఉన్న ఓ కబేలా వ్యాపారి(business man) అక్బర్(akbar) తాము చెప్పిన రేటుకే అమ్మాలని రైతుకు చెప్పాడు. రైతు దానిని రూ.50 వేలకు అమ్ముతానని చెప్పగా..అక్బర్ మాత్రం కేవలం 10 వేల రూపాయలకే కొంటానని పేర్కొన్నాడు. అసలు సంబంధం లేకుండా అంత తక్కువ రేటు(price) ఎంటగా రైతు ప్రశ్నించగా..వ్యాపారి రైతుపై దాడి చేశాడు. అంతేకాదు తనకే ఆ దూడను అమ్మేల్సిందేనని ఆ వ్యాపారి దానిని లాక్కున్నాడు. ఆ క్రమంలో రైతు(Farmer) ఆపే ప్రయత్నం చేయగా అతన్ని నెట్టివేశాడు. ఆ క్రమంలో రైతు ఆ దూడను అమ్మబోనని ఆపే ప్రయత్నం చేయగా..వ్యాపారి అక్బర్ దూడను కర్రతో గట్టిగా కొట్టాడు. దీంతో ఆ దూడ మృతి చెందింది.
ఇది గమనించిన అక్కడి రైతులు(Farmers) సహా పలువు ఆగ్రహం వ్యక్తం చేసి వ్యాపారి అక్బర్(akbar)ను నిలదీసే ప్రయత్నం చేయగా అతను పారిపోయాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాక బాధిత రైతుతోపాటు పలువురు అతనికి న్యాయం చేయాలని కోరుతు రోడ్డుపై దూడను పెట్టుకుని ఆందోళన(protest) నిర్వహించారు. విషయం తెలిసిన పోలీసులు(police) ఘటనా స్థలానికి చేరుకుని రైతుకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ క్రమంలో రైతు ఫిర్యాదు(compliant) మేరకు పోలీసులు వ్యాపారిపై కేసు నమోదు చేశారు.
అయితే కోదాడ పశువుల సంతలో దళారీలు, కబేలాలు ఒక్కటై రైతులపై దౌర్జన్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సైతం వారిపై చర్యలు(action) తీసుకోవాలని అనేక మంది కోరినట్లు తెలిసింది. ఆర్థిక అవసరాల కోసం తమ పశువులను అమ్మేందుకు వచ్చిన రైతులకు అన్యాయం చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనల పట్ల పోలీసులు సహా ప్రభుత్వం(governament) కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.