ap capital city:రాజధానిపై బుగ్గన కామెంట్స్.. తప్పుపట్టిన సజ్జల, ధర్మాన.. మంత్రులకే సఖ్యత లేదు
ap capital city:ఏపీ రాజధాని (ap capital) ఇష్యూ మరోసారి రాజేసింది. నిన్న ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy) మాట్లాడారు. ఏపీ రాజధాని విశాఖ అని.. మూడు రాజధానులు అని జనాల్లో మిస్ కమ్యూనికేట్ అయిందని చెప్పుకొచ్చారు. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) స్పందించారు. మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు.
ap capital city:ఏపీ రాజధాని (ap capital) ఇష్యూ మరోసారి రాజేసింది. నిన్న ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy) మాట్లాడారు. ఏపీ రాజధాని విశాఖ అని.. మూడు రాజధానులు అని జనాల్లో మిస్ కమ్యూనికేట్ అయిందని చెప్పుకొచ్చారు. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) స్పందించారు. మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. వికేంద్రీకరణ అవసరాన్ని గుర్తించే మూడు రాజధానుల బిల్లు పెట్టామని పేర్కొన్నారు. మూడు రాజధానుల అంశం న్యాయస్థానంలో నడుస్తోందని వెల్లడించారు. ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి తేడా లేదని సజ్జల స్పష్టం చేశారు.
మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు (dharmana prasada rao) కూడా స్పందించారు. శివరామకృష్ణ (shiva ramakrishna) కమిటీ నివేదిక ఆధారంగా తమ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వం రాజధానిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేసిందని ఆరోపించారు. పెట్టుబడులు అన్నీ ఒకే ప్రాంతంలో పెడితే ప్రాంతాల మధ్య అసమానతలు ఏర్పడతాయని వివరించారు. మూడు రాజధానులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. మూడు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్నే సీఎం జగన్ (cm jagan) అమలు చేస్తున్నారని ధర్మాన స్పష్టం చేశారు. మూడు రాజధానుల అంశం విస్తృత ప్రయోజనాలతో కూడుకుందని తెలిపారు. బుగ్గన కామెంట్లను వీరిద్దరూ కొట్టిపారేశారు. 3 రాజధానులకు కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పారు.
ఇటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (nadendla manohar) మండిపడ్డారు. ఏపీ రాజధానిగా విశాఖను ఎవరూ కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. విశాఖ రాజధాని అంశంపై ఉత్తరాంధ్రులకు నమ్మకం లేదన్నారు. రాజధాని విషయంలో మంత్రుల మధ్య సఖ్యత లేదని విమర్శించారు. దమ్ముంటే రాజధాని అజెండాతో ఎన్నికలకు వెళదాం అని సీఎం జగన్కు (cm jagan) సవాల్ విసిరారు. ఇంత దౌర్భాగ్యపు పాలన ఎక్కడా చూడలేదని అన్నారు. విశాఖలో (vizag) ప్రభుత్వ కార్యాలయాలు పెట్టినంత మాత్రాన తమ జీవితాలు మారిపోతాయని ఉత్తరాంధ్ర ప్రజలు భావించడం లేదని తెలిపారు. రోడ్డు వేయలేని ఈ సీఎం ఉన్న రాజధానిని డెవలప్ చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
“నేను విశాఖ వెళ్లిపోతున్నానని సీఎం (cm) అంటారు. ఒక మంత్రి విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటారు. ఉత్తరాంధ్రకు చెంది ఓ మంత్రి ప్రత్యేక రాష్ట్రం కావాలంటారు. రాజకీయ లబ్ది కోసం ప్రాంతాల మధ్య చిచ్చుపెడతారా?” అని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉన్నవాళ్లు అయితే అమరావతితోపాటు (amaravati) విశాఖ (vizag), కర్నూలును (kurnool) ఒకే రీతిలో అభివృద్ధి చేయాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. అమరావతి ఒక్కటే ఏపీ రాజధాని అనేది జనసేన విధానం అని మరోసారి స్పష్టం చేశారు.