»Fraud In The Name Of Gold Scheme Unable To Repay Debts Two Committed Suicide
Vijayawada: గోల్డ్ స్కీమ్, చీటీల పేరుతో మోసం..అప్పులపాలై ఇద్దరు సూసైడ్
గోల్డ్ స్కీమ్ పేరుతో మహిళల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేసి చివరగా తమ వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.
గోల్డ్ స్కీమ్(Gold Scheme) పేరుతో మహిళల దగ్గరి నుంచి డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత చీటీల(Chittis) పేరుతో ఇంకొందరిని మోసం చేసి ఆఖరికి అప్పుల పాలై వాటిని తీర్చలేక ఇద్దరు ఆత్మహత్య(suicide) చేసుకున్నారు. విజయవాడలోని భవానీపురంలో గోల్డ్ స్కీమ్ నిర్వాహకుల ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. వారికి డబ్బులు కట్టినవారి పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుతం వారు ఆందోళనకు గురవుతున్నారు.
భవానీపురంలో నేతాజీ స్కూలు రోడ్డులో నివాసం ఉండే దివి తారకరామారావు గోల్డ్ వ్యాపారం(Gold Business) చేసేవాడు. కొన్నేళ్ల కిందట ఆయనకు తుపాకుల దుర్గాదేవితో పరిచయం అవ్వగా వారిద్దరూ కలిసి బంగారం స్కీమ్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించారు. నెలనెలా కొంత మొత్తం చెల్లిస్తే బంగారు ఆభరణాలు(Jewellery) ఇస్తామని చెప్పి చాలా మంది మహిళల దగ్గర డబ్బులు వసూలు చేశారు. దాంతో పాటు చీటీలు నిర్వహించి ఇంకొంత డబ్బును వసూలు చేశారు.
రానురానూ వారి వ్యాపారం(Business)లో నష్టాలు రావడంతో కస్టమర్ల నుంచి ఒత్తిడి ఎదురైంది. తమ కస్టమర్లకు నగదు తిరిగి చెల్లించేందుకు తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేశారు. ఇంతలో రామారావు అనారోగ్యం పాలవ్వడంతో కస్టమర్ల నుంచి ఇంకాస్త ఒత్తిడి ఎక్కువైంది. అప్పుల వాళ్లకు చెల్లించాల్సిన సొమ్ము రూ.కోట్లల్లో ఉండడంతో శనివారం రాత్రి రామారావు, దుర్గాదేవి ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య(Suicide) చేసుకున్నారు. బంధువులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. దీంతో గోల్డ్ స్కీం(Gold Scheme)లో చేరిన వారు, చీటీ ఖాతాదారులు, అప్పుల వాళ్లు రామారావు ఇంటివద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.