ఫుడ్ పాయిజన్ అయిన క్రమంలో 26 మంది బీటెక్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం ప్రాంతంలోని SRIT ఇంజినీరింగ్ కాలేజీ హస్టల్లో చోటుచేసుకుంది. అయితే మంగళవారం రాత్రి విద్యార్థులు ఎగ్ తోపాటు టమాటా రైస్, పెరుగు తిన్నారు. ఆ నేపథ్యంలోనే 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని అమరావతి ఆస్పత్రికి తరలించారు. మరోవైపు వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.