»Five Killed In Bapatla Ap Auto And Lorry Collision Accident
Accident: ఆటో, లారీ ఢీకొని ఐదుగురు మృతి
ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉదయం జరిగిన రెండు ప్రమాదాల్లో ఏకంగా ఏడుగురు మృత్యువాత చెందారు. ఆటోను లారీ ఢీకొట్టిన(accident) ఘటనలో ఐదుగురు మరణించగా..బైక్స్(bikes) ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
five killed in bapatla ap auto and lorry collision accident
ఏపీ(Andhra Pradesh)లోని బాపట్ల(bapatla) జిల్లా సంతమాగులూరులోని ప్రభుత్వ పాఠశాల పరిధిలో ఆదివారం ఉదయం ఆకస్మాత్తుగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది(accident). ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. అయితే ప్రమాదం జరిగిన క్రమంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళా ప్రయాణికులు, మరో వ్యక్తి స్పాట్ లోనే మృత్యువాత చెందారు. ఆ క్రమంలో గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు మహిళలను నర్సరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ నేపథ్యంలో వారు చికిత్స పొందుతు మరణించారు. అయితే ఆటోలో ప్రయాణిస్తున్న వారు గుంటూరు ప్రాంతానికి చెందిన ఆర్కెస్ట్రా పెళ్లి బృందమని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు అనంతపురం జిల్లాలో రెండు ద్విచక్రవాహానాలు(bikes) ఢీకొని ఇద్దరు యువకులు మృత్యువాత చెందారు. విడపనకల్లు మండలం పొలికి వద్ద జరిగిన ప్రమాదంలో 18 ఏళ్ల బాలు, 20 ఏళ్ల వర్ధన్ మరణించినట్లుగా గుర్తించారు. అయితే ప్రతిసారి వీకెండ్ వస్తే చాలు అనేక మంది దూర ప్రయాణాలు చేస్తు అప్రమత్తంగా ఉండటం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి క్రమంలో ప్రజలు జర్నీ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరికొంత మంది యువకులు మాత్రం విచ్చలవిడిగా వేగం నియంత్రణ లేకుండా బైక్స్ పై ప్రయాణిస్తున్నారని అధికారులు గుర్తు చేస్తున్నారు.