VZM: ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి GVMC కమిషనర్ సంపత్ కుమార్ను బుధవారం ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలసి వినతిపత్రం అందజేసారు. ఈ మేరకు కృష్ణాపురం గ్రామ రహదారికి బీటీ రోడ్డు పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరారు. ఈ రోడ్డు తాటిపూడి, ముషిడిపల్లి, మధుపాడ, వేములపల్లి గ్రామాలకు అనుసంధానం అని తెలిపారు.