GNTR: 4G ఇతర సేవల గురించి టెలి కమ్యూనికేషన్ అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. పెమ్మసాని మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి గ్రామంలో 4G మొబైల్ సేవలను అందించడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం 4G సంతృప్త ప్రాజెక్టును చేపట్టిందన్నారు. ఏపీలోని రెండు ప్రాజెక్టుల పురోగతిని శాఖ అధికారులతో సమీక్షించినట్లు తెలిపారు.