ATP: రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కుందేళ్ళ ఆంజనేయులు అనారోగ్యంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పరిటాల సునీత గ్రామానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.