NDL: ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని గిరిజనుల సమస్యలను ఇటీవల సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొని వెళ్లిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కోలేగుండ్ల నరసింహుడు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. వెదురు ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు విధించిన ఆంక్షలు బాధాకరమైనవన్నారు.