VZM: ఎస్.కోట మండలం వినాయకపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ను దుండగులు అపహరించారు. బైక్ కనిపించకపోవడంతో యజమాని శివ వెతికినా లభించలేదు. అనంతరం ఎస్.కోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నారాయణమూర్తి తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.