సత్యసాయి: అటల్ మోదీ సుపరిపాలన యాత్ర సందర్భంగా ధర్మవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైకిళ్ల పంపిణీ జరిగింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విద్యార్థులకు సైకిళ్లు ఇచ్చారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, సహచర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు.