KDP: సిద్ధవటం మండలంలోని కమ్మపాలెం గ్రామం మీదుగా మంగళవారం గేదెలను తరలిస్తున్న దొంగలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కడపలోని ఇందిరానగరుకు చెందిన జనార్ధన్ మరో ఇద్దరు యువకులతో కలిసి 10 గేదెలను పట్టుకొని సిద్ధవటంలోని అమ్మపాలెం ప్రధాన రహదారి మీదుగా బద్వేల్ కు బయలుదేరారు. అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు అప్పగించారు.