CTR: కూటమి ప్రభుత్వంలోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. బుధవారం గుడిపాల మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీఎం ఎజేవై (ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన) ద్వారా గ్రామ పంచాయతీలలో చెత్త సేకరణ కోసం మంజూరైన ఐదు ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా ఒక ఆటోను నడిపి ప్రదర్శన చేశారు.