KDP: కొండాపురంలోని రాఘవేంద్ర స్వామి ఫంక్షన్ హాల్లో 11 మంది లబ్ధిదారులకు ముఖ్య మంత్రి సహాయానిధి (CMRF) చెక్కులను అందజేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సహకారంతో కూటమి మండలం ఇన్ఛార్జ్ శివనారాయణరెడ్డి గురువారం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, సంక్షేమం అభివృద్ధికి కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.