ప్రకాశం: కొండేపి వైసీపీ ఇంఛార్జ్, మాజీ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ శుక్రవారం టంగుటూరు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మండల నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలను, బలోపేతం వంటి అంశాలపై వారితో చర్చించారు. అలాగే ఎంపీటీసీ శిఖా నిర్మల భర్త సుబ్బారావు అనారోగ్యంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనను పరామర్శించారు.