ప్రకాశం: ఒంగోలులోని ప్రభుత్వ బాలుల ఐటీఐ కళాశాలలో సోమవారం జరిగిన జాబ్ మేళాకు 72 మంది విద్యార్థులు హాజరుకాగా, 43 మంది అప్రెంటీస్ శిక్షణకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఈ అప్రంటీస్ మేళాలో ఐటీఐ విద్యార్థులకు గొప్ప అవకాశమన్నారు. అప్రంటీస్ షిప్ మేళాను విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు.