NDL: పాణ్యం ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం హౌసింగ్ పనుల పురోగతిపై MLA చరితా రెడ్డి సమావేశం నిర్వహించారు. మండల పరిధిలోని పంచాయతీ ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో మాట్లాడి ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఆదేశించారు. లబ్ధిదారులకు సదుపాయాలు కల్పించాలన్నారు. తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, టీడీపీ నేత జయరామి రెడ్డి పాల్గొన్నారు.