TPT: తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజులపాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 7 గంటల ప్రాంతంలో బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.