MHBD: గూడూరు మండల కేంద్రంలో రావణ వధ వేడుకను హిందూ ఉత్సవ సమితి, ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చిన్నారుల సాంస్కృతిక, కార్యక్రమాలు అలరించాయి. భారీ ఎత్తున ఏర్పాటు చేసిన రావణాసురుడి వధ వేడుకను వైభవంగా జరిపారు. ఉత్సవాన్ని వీక్షించడానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలకు పోలీసులు బందోబస్తు కల్పించారు.