NTR: విజయవాడలోని ఓ కళాశాల ప్రాంగణంలో రాష్ట్రస్థాయి కౌశల్ ప్రతిభా పోటీలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో గణితం, సైన్స్ సబ్జెక్టులలో క్విజ్‌తో పాటు వివిధ అంశాలపై పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలు నిర్వహించారు.