NTR: గణనాథుని నవరాత్రి ఉత్సవాల వేడుకల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. కొండపల్లిలోని ప్రధాన సెంటర్లో చవితి పూజలను అందుకుంటున్న గణనాథుడిని ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం వినాయక స్వామి వారికి హారతినిచ్చారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో విఘ్నాలు తొలగి, అందరూ సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.