SKLM: నిరుపేదలకు అండగా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గారు అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం పోలాకి మండలం, తలసముద్రం పంచాయతీ, మల్లపేట గ్రామంలో లబ్ధిదారులకు సామజిక పింఛన్లు పంపిణీ చేశారు. పేదల పక్షపాతిగా ప్రభుత్వం పని చేస్తూ అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తున్నాం అన్నారు.