ప్రకాశం: కంభం పట్టణంలోని హ్యాపీ రెసిడెన్సీలో పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురిని పట్టుకుని వారి నుంచి రూ.6,060 స్వాధీనపరుచుకున్నాను. ఈ సందర్భంగా ఎస్సై శివ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నివాస సముదాయాల్లో, అపార్ట్మెంట్లలో నిబంధనలకు విరుద్ధంగా పేకాట వంటి అసాంఘిక పనులకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.